వార్త ముఖ్యాంశాలు
- ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై మార్గదర్శకాలు జారీ చేసింది.
- అభ్యర్థుల పేర్లను మూడు కేటగిరీలుగా వర్గీకరించి ముద్రించాలని సూచించింది.
- జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులుగా విభజించింది.
ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై మార్గదర్శకాలు జారీ చేసింది. అభ్యర్థుల పేర్లను మూడు కేటగిరీలుగా వర్గీకరించి ముద్రించాలని సూచించింది. జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులుగా విభజించింది. అభ్యర్థి, పార్టీ పేర్లను తొలుత తెలుగులో, కింద ఇంగ్లీష్‌లో ముద్రించాలని, ఎన్నికల గుర్తులు మాత్రం ముద్రించరాదని స్పష్టం చేసింది.