వార్త ముఖ్యాంశాలు
- 2027లోగా పోలీసుశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం: రేవంత్‌రెడ్డి పోలీసు అమరవీరుల కుటుంబాలు ఒంటరివి కావని, వారికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు.
- పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ఆయన పాల్గొని, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వారికి నివాళులర్పించారు.
- సమాజ భద్రత కోసం పోలీసులు చేసిన త్యాగాలను ఎప్పటికీ మరువలేమన్నారు.
2027లోగా పోలీసుశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం: రేవంత్‌రెడ్డి
పోలీసు అమరవీరుల కుటుంబాలు ఒంటరివి కావని, వారికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ఆయన పాల్గొని, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వారికి నివాళులర్పించారు. సమాజ భద్రత కోసం పోలీసులు చేసిన త్యాగాలను ఎప్పటికీ మరువలేమన్నారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ శాంతియుతమైన, సురక్షితమైన తెలంగాణ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా 154 మంది అమరులయ్యారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో ఏఎస్ఐ డి.దేవి సింగ్, కానిస్టేబుళ్లు ఎంపల్లి ప్రమోద్‌కుమార్, శీలం కమలాకర్, ఎక్సైజ్ శాఖకు చెందిన గాజుల సౌమ్య విధి నిర్వహణలో మరణించారని గుర్తుచేశారు. వారి సేవలు, త్యాగాలు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధను ఎవరూ పూర్తిగా తీర్చలేరని, అయితే వారి కష్టసుఖాల్లో ప్రభుత్వం, పోలీసుశాఖ, తెలంగాణ సమాజం తోడుగా ఉంటాయని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత ముఖ్యమని రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకే తమ ప్రభుత్వం పోలీసుశాఖకు ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు. మరో ఐదువేల పోలీసు ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామని, 2027లోగా శాఖలోని అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 112 మంది డీఎస్పీలను నియమించామని తెలిపారు. ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడం ద్వారా ఉపాధితోపాటు వారి ఆత్మగౌరవాన్ని పెంచేందుకు కృషి చేశామన్నారు.
విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసుల కుటుంబాలకు అందించే పరిహారాన్ని పెంచినట్లు ముఖ్యమంత్రి వివరించారు. కానిస్టేబుళ్లకు గతంలో రూ.40 లక్షలుగా ఉన్న ఎక్స్‌గ్రేషియాను రూ.కోటికి పెంచామన్నారు. హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలకు రూ.45 లక్షల నుంచి రూ.కోటికి పెంచామని చెప్పారు. ఎస్ఐలకు గతంలో రూ.45 లక్షలు, ఇన్స్పెక్టర్లకు రూ.50 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ.1.25 కోట్లకు పెంచినట్లు తెలిపారు.
డీఎస్పీలు, అదనపు ఎస్పీ స్థాయి అధికారులకు రూ.50 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ.1.50 కోట్లకు పెంచామని వెల్లడించారు. ఎస్పీ, ఐపీఎస్ అధికారులకు రూ.కోటి నుంచి రూ.రెండు కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే గౌరవమన