Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

పోలీసుల ఆధ్వర్యంలో పల్లెనిద్ర – ప్రజా అవగాహన కార్యక్రమం!!*_

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పోలీసుల ఆధ్వర్యంలో పల్లెనిద్ర – ప్రజా అవగాహన కార్యక్రమం!!*_

_*!!పోలీసుల ఆధ్వర్యంలో పల్లెనిద్ర – ప్రజా అవగాహన కార్యక్రమం!!*_

*ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, గణపవరం గ్రామంలో బుధవారం రాత్రి పోలీసులు ‘పల్లెనిద్ర – ప్రజా అవగాహన కార్యక్రమం’నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోతెలుసుకోవడంతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలను భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు*.

*కార్యక్రమంలో భాగంగా ముందుగా గ్రామంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పోలీసు అధికారులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు*.

*అనంతరం బీసీ సెంటర్‌లోని వేపచెట్టు అరుగు వద్ద పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మైలవరం సీఐ కిషోర్ గారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, సాధ్యమైనంత మేరకు క్షేత్రస్థాయిలోనే పరిష్కార మార్గాలు చూపించేందుకు పల్లెనిద్ర కార్యక్రమం ఒక చక్కటి వేదికగా నిలుస్తుందని అన్నారు*.

*శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని, ప్రతి చిన్న సమస్యకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలా పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ఎవరూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు*.

*మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొంటూ, సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న నేరాలు, సైబర్ మోసాలు, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ కార్యకలాపాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో అక్రమ మద్యం, గంజాయి, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు*.

*అలాగే గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరించాలని సీఐ కిషోర్ గారు కోరారు. పోలీస్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించేందుకు పల్లెనిద్ర కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు*.

*ఎస్ఐ కె. సుధాకర్ గారు మాట్లాడుతూ, సైబర్ మోసాలు, ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న మోసాలు, ఓటీపీ ఫ్రాడ్స్, మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై గ్రామస్తులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజ్‌లు లేదా లింకులకు స్పందించవద్దని సూచించారు*.

*అనంతరం పోలీసులు, గ్రామస్తులు కలిసి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి, గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది పంచాయతీ కార్యాలయంలో బస చేశారు*.

*ఈ కార్యక్రమంలో వజ్రాల బుజ్జిరెడ్డి, నంబూరి శ్యాం ప్రసాద్, అక్కల రమణారెడ్డి, ఏరువ శారదాదేవి, పాకలపాటి అంబేద్కర్, తాళ్ల రామకృష్ణ, గుంటక వెంకటేశ్వరరెడ్డి (నాని), తాళ్ల శివకృష్ణ,సతీష్ రెడ్డి, ఆదిత్యరెడ్డి, రాజేష్ తదితర గ్రామ పెద్దలు, నాయకులు, గ్రామస్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు*.

పోలీసుల ఆధ్వర్యంలో పల్లెనిద్ర – ప్రజా అవగాహన కార్యక్రమం!!*_

Leave a comment

Your email address will not be published. Required fields are marked *