Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

పోయిన బంగారు ఆభరణాల బ్యాగ్‌ సురక్షితంగా స్వాధీనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పోయిన బంగారు ఆభరణాల బ్యాగ్‌ సురక్షితంగా స్వాధీనం

వార్త ముఖ్యాంశాలు

  • సీసీటీవీ ఆధారంగా బస్సును గుర్తించి బాధితురాలికి అప్పగించిన నాయుడుపేట పోలీసులు నాయుడుపేట ఆగస్టు 26 తిరుపతి జిల్లా నాయుడుపేట బస్టాండ్‌లో పోయిన విలువైన బ్యాగ్‌ను పోలీసులు చాకచక్యంగా స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు.
  • నాయుడుపేటకు చెందిన గువ్వల దేవి బస్టాండ్‌లో తనకు చెందిన నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు, రూ.1,000 నగదు, సెల్‌ఫోన్ ఉన్న బ్యాగ్‌ పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
  • బాధితురాలి ఫిర్యాదుపై నాయుడుపేట ఎస్సై ఎం.

సీసీటీవీ ఆధారంగా బస్సును గుర్తించి బాధితురాలికి అప్పగించిన నాయుడుపేట పోలీసులు

నాయుడుపేట ఆగస్టు 26

తిరుపతి జిల్లా నాయుడుపేట బస్టాండ్‌లో పోయిన విలువైన బ్యాగ్‌ను పోలీసులు చాకచక్యంగా స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. నాయుడుపేటకు చెందిన గువ్వల దేవి బస్టాండ్‌లో తనకు చెందిన నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు, రూ.1,000 నగదు, సెల్‌ఫోన్ ఉన్న బ్యాగ్‌ పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుపై నాయుడుపేట ఎస్సై ఎం. శివశంకరరావు వెంటనే స్పందించి సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. బస్టాండ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు బ్యాగ్‌ ఉన్న బస్సు నెల్లూరు వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. ఎస్సై శివశంకరరావు పర్యవేక్షణలో క్రైమ్‌ పార్టీ సిబ్బందిని అప్రమత్తం చేసి, నెల్లూరు పోలీసులతో సమన్వయం చేసుకుంటూ బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేశారు. ఈ క్రమంలో పోయిన బ్యాగ్‌ను పోలీసులు సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. అందులోని నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు, రూ.1,000 నగదు, సెల్‌ఫోన్ తదితర వస్తువులను ఎలాంటి నష్టం లేకుండా బాధితురాలికి అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వేగంగా స్పందించి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై ఎం. శివశంకరరావుతో పాటు హెడ్‌ కానిస్టేబుల్ రాజు, కానిస్టేబుల్ పోలయ్యలను నాయుడుపేట డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *