Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జాతీయ అంతర్జాతీయ

*పెట్రోల్ మరియు డీజిల్ సరఫరాపై తాత్కాలిక నియంత్రణలు విధిస్తూ.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ…*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *పెట్రోల్ మరియు డీజిల్ సరఫరాపై తాత్కాలిక నియంత్రణలు విధిస్తూ..
  • గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ...* రిటైల్ పెట్రోల్ బంకుల ద్వారా పెట్రోల్ మరియు డీజిల్ సరఫరాను తాత్కాలికంగా నియంత్రిస్తూ ఉత్తర్వులు..
  • *రిటైల్ బంకుల విక్రయాలపై పరిమితులు:* 1.

*పెట్రోల్ మరియు డీజిల్ సరఫరాపై తాత్కాలిక నియంత్రణలు విధిస్తూ.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ…*

రిటైల్ పెట్రోల్ బంకుల ద్వారా పెట్రోల్ మరియు డీజిల్ సరఫరాను తాత్కాలికంగా నియంత్రిస్తూ ఉత్తర్వులు..

*రిటైల్ బంకుల విక్రయాలపై పరిమితులు:*

1. ఒక కస్టమర్ లేదా వాహనానికి రోజుకు 200 లీటర్ల కంటే ఎక్కువ డీజిల్ ఇవ్వకూడదు…

2. రిటైల్ బంకుల నుండి కొనుగోలు చేసిన డీజిల్‌ను వేరే ఎవరికీ తిరిగి విక్రయించకూడదు (Resold).

2. రిటైల్ బంకుల డీలర్లు డీజిల్‌ను కేవలం వాహనాల ట్యాంకుల్లోకి లేదా PESO (పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్) ఆమోదించిన కంటైనర్లలో మాత్రమే పోయాలి.

*బల్క్ వినియోగదారులపై ఆంక్షలు:*

పారిశ్రామిక, వాణిజ్య మరియు పెద్ద సంస్థలు.. తమకు కావలసిన పెట్రోల్/డీజిల్‌ను రిటైల్ బంకుల నుండి తీసుకోకూడదు.. వారు కేవలం తమ స్వంత కన్స్యూమర్ పంపుల ద్వారా మాత్రమే ఇంధనాన్ని పొందాలి..

*ఉత్తర్వుల కాలపరిమితి:*

ఈ నిబంధనల ఉత్తర్వు జారీ చేసిన తేదీ నుండి ప్రాథమికంగా 90 రోజుల వరకు అమలులో ఉంటుంది. అవసరమైతే దీనిని పొడిగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది..

*రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు:*

రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ఈ క్రిందివాటిపై నిఘా పెట్టాలని ఆదేశాలు..
యూ
హోర్డింగ్ : ఇంధనాన్ని అక్రమంగా నిల్వ ఉంచడం.

బ్లాక్ మార్కెటింగ్ : కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరలకు అమ్మడం.

డైవర్షన్ : సాధారణ ప్రజల కోసం కేటాయించిన ఇంధనాన్ని పరిశ్రమలకు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు మళ్లించడం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *