Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

పుల్లంపేటలో 250 మొక్కలు నాటిన పోలీసులు.. పచ్చదనే లక్ష్యం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పుల్లంపేటలో 250 మొక్కలు నాటిన పోలీసులు.. పచ్చదనే లక్ష్యం!

వార్త ముఖ్యాంశాలు

  • పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పుల్లంపేట ఎస్బీవీడీఎస్ హైస్కూల్‌లో గురువారం మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు.
  • జిల్లా ఎస్పీ ఎల్.
  • సుబ్బరాయుడు ఆదేశాల మేరకు కోడూరు రూరల్ సర్కిల్ సీఐ, పుల్లంపేట ఎస్‌ఐ ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణంలో 250 మొక్కలు నాటారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పుల్లంపేట ఎస్బీవీడీఎస్ హైస్కూల్‌లో గురువారం మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు కోడూరు రూరల్ సర్కిల్ సీఐ, పుల్లంపేట ఎస్‌ఐ ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణంలో 250 మొక్కలు నాటారు. పాఠశాల పరిసరాలను పచ్చదనంతో తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ చెట్లు మానవాళికి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని క్రమం తప్పకుండా సంరక్షించి పెద్ద చెట్లుగా పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి, దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు.
‘‘నేడు నాటిన మొక్కలు రేపటి తరాలకు పచ్చని భవిష్యత్‌ను అందిస్తాయి’’ అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పోలీస్ శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *