Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా హిందీ పఖవాడ సమాపన సమారోహ్!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా హిందీ పఖవాడ సమాపన సమారోహ్!!

వార్త ముఖ్యాంశాలు

  • పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా హిందీ పఖవాడ సమాపన సమారోహ్!!
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), పాల్వంచలో 15 రోజులపాటు నిర్వహించిన హిందీ పఖవాడ కార్యక్రమాల ముగింపు సందర్భంగా హిందీ పఖవాడ సమాపన సమారోహ్ ను మంగళవారం ఘనంగా నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.

పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా హిందీ పఖవాడ సమాపన సమారోహ్!!

ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), పాల్వంచలో 15 రోజులపాటు నిర్వహించిన హిందీ పఖవాడ కార్యక్రమాల ముగింపు సందర్భంగా హిందీ పఖవాడ సమాపన సమారోహ్ ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ప్రొ. పి. పద్మ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొ. పి. పద్మ మాట్లాడుతూ ..హిందీ భారతదేశ రాజభాషగా విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉందని అన్నారు. దేశ ప్రజలను భాషా పరంగా అనుసంధానించడంలో హిందీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. 15 రోజులపాటు కళాశాలలో హిందీ భాషపై అవగాహన కల్పించేలా వివిధ కార్యక్రమాలు, పోటీలు నిర్వహించిన హిందీ విభాగాన్ని ఆమె అభినందించారు.
కళాశాల హిందీ శాఖాధిపతి డా. టి. అరుణకుమారి మాట్లాడుతూ 15 రోజులపాటు నిర్వహించిన వివిధ పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. హిందీ భాష పట్ల విద్యార్థుల్లో ఆసక్తి, అభిమానం పెంపొందించేందుకు పఖవాడ కార్యక్రమాలు దోహదపడ్డాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హిందీ దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించుకోవాలి?అనే అంశంపై పలువురు విద్యార్థినీ విద్యార్థులు ప్రసంగించారు. హిందీ భాష ప్రాధాన్యత, చారిత్రక నేపథ్యం, భాషా వైవిధ్యంలో దాని పాత్ర వంటి అంశాలను వివరించారు. పలువురు విద్యార్థులు హిందీ కవితలను పఠించడంతో పాటు హిందీ పాటలను ఆలపించి, హిందీ భాష గొప్పతనాన్ని చాటుతూ ప్రసంగించారు.
హిందీ పఖవాడలో నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ “తన్ కో ఛావ్– మన్ కో జ్ఞాన్… హిందీ మేరీ షాన్” అనే సూక్తిని ముద్రించిన గొడుగులను బహుమతులుగా అందజేశారు. హిందీ భాష గొప్పతనాన్ని వినూత్న రీతిలో చాటుతూ అందించిన ఈ బహుమతులు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో మరో ప్రత్యేక ఆకర్షణగా విద్యార్థులు మనోజ్, సాహిత్, సందీప్ కళాశాల అధ్యాపకులందరి ద్వారా హిందీ భాష గొప్పతనాన్ని తెలియజేసే విధంగా రూపొందించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. ఈ వీడియో కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బి. రమేష్, కామేశ్వరరావు, పి. శ్రీనివాస్, పి. శ్రీనివాసరావు, కె. రాంబాబు, ఈ. శ్రీను, పర్వీన్, శ్రీదేవి, దీపిక, విమల, హారిక, వకుళ, కరీమా, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. వారు విద్యార్థుల ప్రతిభను, హిందీ విభాగం నిర్వహించిన కార్యక్రమాలను ప్రశంసించి అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *