వార్త ముఖ్యాంశాలు
- వరికుంటపాడు మండలం రామాపురంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో పల్లె పండుగ–3.0 ఘనంగా నిర్వహించారు.
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.
- మాధవ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
వరికుంటపాడు మండలం రామాపురంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో పల్లె పండుగ–3.0 ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.11,085 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు. గ్రామీణ రహదారులు, డ్రెయిన్లు, మౌలిక వసతులు, ఉద్యాన పంటలకు సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టారు. ఉదయగిరి నియోజకవర్గానికి వెలిగొండ ఫేజ్–2 పూర్తి, పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ కాలువకు రూ.52.52 కోట్లు, సోమశిల హై లెవెల్ కెనాల్ భూసేకరణకు రూ.85 కోట్లు, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌కు రూ.3,576 కోట్ల పెట్టుబడులు, ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు రూ.100 కోట్లు ప్రకటించారు. అనంతరం కాకొల్లువారిపల్లెలో సీఎంకు, డిప్యూటీ సీఎంకు గ్రామస్థులు పూలవర్షంతో స్వాగతం పలికారు. అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.