Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పల్లె పండుగకు సర్వం సిద్ధం.. దుత్తలూరు సెంటర్‌లో నాయకుల పర్యవేక్షణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పల్లె పండుగకు సర్వం సిద్ధం.. దుత్తలూరు సెంటర్‌లో నాయకుల పర్యవేక్షణ

దుత్తలూరు: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురంలో పల్లె పండుగ–3.0లో భాగంగా అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు రూ.11,085 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం, డిప్యూటీ సీఎం రామాపురం పర్యటన నేపథ్యంలో రహదారులు, సభా ప్రాంగణం, ఇతర ఏర్పాట్లను అధికారులు, నాయకులు పర్యవేక్షిస్తున్నారు. రామాపురం వెళ్లే మార్గంలోని దుత్తలూరు సెంటర్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, కొమ్మి లక్ష్మీ నాయుడు, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.

పల్లె పండుగకు సర్వం సిద్ధం.. దుత్తలూరు సెంటర్‌లో నాయకుల పర్యవేక్షణ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *