Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పర్ల కొండ మాతమ్మ పోలేరమ్మ ఆలయాలలో చోరీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

నెల్లూరు జిల్లా కలువాయి మండలం పర్లకొండ గ్రామంలో రెండు ఆలయాల్లో చోరీ ఘటన కలకలం రేపింది. గ్రామంలోని మాతమ్మ, పోలేరమ్మ ఆలయాలను టార్గెట్ చేసిన గుర్తుతెలియని దొంగలు.. ఆలయాల్లోని హుండీలను ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయాలకు వెళ్లిన భక్తులు హుండీలు కనిపించకపోవడంతో విషయాన్ని గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఒకే గ్రామంలో రెండు ఆలయాల్లో చోరీ జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో వరుసగా ఆలయాలే లక్ష్యంగా దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. రాత్రి వేళల్లో ఆలయాల వద్ద భద్రత లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఆలయాల వద్ద ఉన్న ఆధారాలు, సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి దొంగలను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వరుస ఆలయ చోరీలకు అడ్డుకట్ట వేసి భక్తుల ఆస్తులకు రక్షణ కల్పించాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *