వార్త ముఖ్యాంశాలు
- పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని డివిజనల్ పంచాయతీ అధికారి మస్తాన్ వల్లి అన్నారు.
- శనివారం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు.
- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఇంటి తోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని డివిజనల్ పంచాయతీ అధికారి మస్తాన్ వల్లి అన్నారు. శనివారం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఇంటి తోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయవద్దని చేత్త బండ్ల లోనే వేయాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేది అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ. ఎంపీడీవో కె ఆర్ ఎం ప్రసాద్ డిప్యూటీ ఎంపీడీవో సునీల్ కార్యదర్శి సురేష్ . రామ్మోహన్ సచివాలయ సిబ్బంది డ్వాక్రా మహిళలు పారిశుద్ధ్య సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు.