Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

పరశురామేశ్వరామేశ్వరుని ఆలయంలో నిత్యన్నదాన భవననిర్మాణం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పరశురామేశ్వరామేశ్వరుని ఆలయంలో నిత్యన్నదాన భవననిర్మాణం

వార్త ముఖ్యాంశాలు

  • ఏర్పేడు,పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 22: ఏర్పేడు మండలం గుడిమల్లంలోని శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయంలో నూతన అన్నదాన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం శనివారంనాడు ఘనంగా నిర్వహించారు.
  • ఈ అన్నదాన భవనాన్ని మైత్రి ఇన్ఫ్రా అండ్ మైనింగ్ సంస్థ వారు తమ సొంత నిధులతో నిర్మించనున్నట్లు తెలిపారు.
  • భక్తులకు నిత్య అన్నదాన సేవలు మరింత సక్రమంగా అందించాలనే లక్ష్యంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బత్తలగిరి నాయుడు గారు, ఆలయ పాలకమండలి సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొని భూమి పూజలో భాగమయ్యారు.

ఏర్పేడు,పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 22: ఏర్పేడు మండలం గుడిమల్లంలోని శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయంలో నూతన అన్నదాన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం శనివారంనాడు ఘనంగా నిర్వహించారు. ఈ అన్నదాన భవనాన్ని మైత్రి ఇన్ఫ్రా అండ్ మైనింగ్ సంస్థ వారు తమ సొంత నిధులతో నిర్మించనున్నట్లు తెలిపారు. భక్తులకు నిత్య అన్నదాన సేవలు మరింత సక్రమంగా అందించాలనే లక్ష్యంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బత్తలగిరి నాయుడు గారు, ఆలయ పాలకమండలి సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొని భూమి పూజలో భాగమయ్యారు. అన్నదాన భవన నిర్మాణం పూర్తయితే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆలయ అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *