Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సాహితీ

పతీ సహగమనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పతీ సహగమనం

వార్త ముఖ్యాంశాలు

  • ఆరు నూరైనా..!
  • నూరు ఆరైనా..!
  • అప్పటికి ఇప్పటికి తిరిగి రానిది ఏదైనా సాధిస్తా నీ రాకతోనైనా తోడుంటా మరో జన్మ దాకైనా ఏడడుగులు వేయగానే తెలిసింది నన్ను ఏలే పతివి నువ్వేనని మూడు ముళ్ళు వేయగానే తెలిసింది మరో జన్మ వరకు తోడుంటావని కాటుక కళ్ళు చూడగానే తెలిసింది నా కనుపాపవు నువ్వేనని…

ఆరు నూరైనా..! నూరు ఆరైనా..!
అప్పటికి ఇప్పటికి తిరిగి రానిది ఏదైనా
సాధిస్తా నీ రాకతోనైనా
తోడుంటా మరో జన్మ దాకైనా
ఏడడుగులు వేయగానే తెలిసింది
నన్ను ఏలే పతివి నువ్వేనని
మూడు ముళ్ళు వేయగానే తెలిసింది
మరో జన్మ వరకు తోడుంటావని
కాటుక కళ్ళు చూడగానే తెలిసింది
నా కనుపాపవు నువ్వేనని
చక్కటి నీ చిరునవ్వు విసరగానే తెలిసింది
నా జీవితానికి వెలుగౌతావని
అందుకే అగ్నిసాక్షిగా..!
ఆ అరుంధతి సాక్షిగా.!
వేదమంత్రముల సాక్షిగా..!
ఏడడుగులు నడిచి,
నా కన్నీటిని తుడిచి,
ప్రేమతో నన్ను పిలిచి,
నువ్వే నన్ను గెలిచి,
నిలిచావే..!నువ్వే నిలిచావే..!
పుడమికి ప్రేమను పంచి
పురిటి బిడ్డ రక్షణను ఎంచి
అలసావే నీవే సొలసావే
ఆలివి నువై అమ్మవు నువై
వెలిగావే దీపంలా నా మదిలో వెలిగావె
ఆనాటి సతీసహగము సాక్షిగా.!
ఈనాడు పతీ సహగమనం చేస్తున్న
నా శ్వాసను సమాధి చేస్తూ,
నీ శ్వాసకు పునాది వేస్తూ,
వస్తున్నా..!నీకోసం వస్తున్నా..!
–కవి, రచయిత -కె. రెడ్డప్ప (భౌతిక శాస్త్ర అధ్యాపకులు, DSR హై స్కూల్, అల్లూరు )

Leave a comment

Your email address will not be published. Required fields are marked *