వరంగల్ కలెక్టరేట్ లో కలెక్టర్ డా.సత్య శారద అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డా వాసం వెంకటేశ్వర్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను సమీక్షించారు. ఫారం 18 దరఖాస్తులను త్వరగా పరిశీలించి, అర్హత ధ్రువపత్రాలను, క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీ చేయాలని ఆదేశించారు. అర్హులైన పట్టభద్రులంతా ఓటును నమోదు చేసుకోవాలని తెలిపారు.
