Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అమరావతి

పట్టణ పీఠాలు.. పార్టీలవారీ కేటాయింపులివే!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పట్టణ పీఠాలు.. పార్టీలవారీ కేటాయింపులివే!

: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు వివరాలు వెల్లడయ్యాయి. టీడీపీకి విజయనగరం, విశాఖపట్నం, మచిలీపట్నం, మంగళగిరి–తాడేపల్లి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు కేటాయించారు. జనసేనకు శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ; బీజేపీకి రాజమహేంద్రవరం, అనంతపురం దక్కాయి. మరో 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో టీడీపీకి 78, జనసేనకు 21, బీజేపీకి ఏడు కేటాయించారు. బీజేపీ జాబితాలో నెల్లిమర్ల, యలమంచిలి, బాపట్ల, గిద్దలూరు, కావలి, ఎర్రగుంట్ల, కర్నూలు జిల్లా గూడూరు ఉన్నాయి. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో టీడీపీకి 89, జనసేనకు 25, బీజేపీకి తొమ్మిది దక్కాయి. అభ్యర్థుల ఎంపికతోపాటు భాగస్వామ్య పార్టీల సమన్వయం కీలకం కానుంది.

పట్టణ పీఠాలు.. పార్టీలవారీ కేటాయింపులివే!

పట్టణ పీఠాలు.. పార్టీలవారీ కేటాయింపులివే!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *