Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

రహదారి పక్కన పూల మొక్కలు పచ్చదనానికి పెద్దపీట

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రహదారి పక్కన పూల మొక్కలు పచ్చదనానికి పెద్దపీట

వార్త ముఖ్యాంశాలు

  • చెన్నారావుపేట: (పున్నమి )మండల పరిధిలోని పాత మొగ్దుంపురం గ్రామంలోని నెక్కొండ–నర్సంపేట ప్రధాన రహదారి డివైడర్‌లో బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని ఆదివారం పూల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • సర్పంచ్ ననుమాస కరుణాకర్, ఉపసర్పంచ్ అలువాల శ్రీనివాస్ మొక్కలు నాటి పచ్చదనం పెంపునకు శ్రీకారం చుట్టారు.
  • ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..

చెన్నారావుపేట: (పున్నమి )మండల పరిధిలోని పాత మొగ్దుంపురం గ్రామంలోని నెక్కొండ–నర్సంపేట ప్రధాన రహదారి డివైడర్‌లో బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని ఆదివారం పూల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ ననుమాస కరుణాకర్, ఉపసర్పంచ్ అలువాల శ్రీనివాస్ మొక్కలు నాటి పచ్చదనం పెంపునకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పండుగల వేళ గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో మొక్కలు నాటినట్లు తెలిపారు. ప్రధాన రహదారి డివైడర్‌లో పూల మొక్కలు పెరిగి పుష్పాలతో విరబూస్తే రహదారికి మరింత అందం చేకూరుతుందని పేర్కొన్నారు. పచ్చని చెట్లు, పూల మొక్కలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడటమే కాకుండా ప్రయాణికులకు, గ్రామస్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయని అన్నారు. నాటిన మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, గ్రామాభివృద్ధిలో భాగంగా పరిశుభ్రత, పచ్చదనానికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కట్టూరి లక్ష్మణచారి, జన్ను రమేష్, షేక్ హసీనా బొత్త, పంచాయతీ సిబ్బంది కల్వచర్ల సాంబయ్య, నాంపల్లి కొమురయ్య, నాంపల్లి ఐలమల్లు, మేకల రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *