వార్త ముఖ్యాంశాలు
- ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని అనంతగిరి మండల వ్యవసాయ అధికారి రంగారావు సూచించారు.
- బీమా నమోదు చేసుకున్న పంటలకు మాత్రమే నష్టపరిహారం లభిస్తుందని తెలిపారు.
- పంట బీమా గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు చెప్పారు.
ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని అనంతగిరి మండల వ్యవసాయ అధికారి రంగారావు సూచించారు. బీమా నమోదు చేసుకున్న పంటలకు మాత్రమే నష్టపరిహారం లభిస్తుందని తెలిపారు. పంట బీమా గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు చెప్పారు. మండలంలోని చిలకలగెడ్డ పంచాయితీ బూడి గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున తట్టుకునే పంటలు సాగు చేయాలని సూచించారు.