Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ పోలీసు బందోబస్తు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ పోలీసు బందోబస్తు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి /వింజమూరు: పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
  • ఈ క్రమంలో కావలి డీఎస్పీ వీవీ రమణకుమార్ బుధవారం ఉదయగిరి పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు.
  • భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఉదయగిరి /వింజమూరు: పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ క్రమంలో కావలి డీఎస్పీ వీవీ రమణకుమార్ బుధవారం ఉదయగిరి పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం వింజమూరు పంచాయతీలోని నామినేషన్ల పరిశీలన కేంద్రాన్ని కూడా సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఎస్సై ఉమామహేశ్వరరావుకు సూచించారు. ఉదయగిరిలో జరిగిన తనిఖీలో ఎస్సై సుభాషిణి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *