డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని ఉండ్రాజవరపు భవ్య శ్రీ న్యూఢిల్లీలోని పార్లమెంట్ సంవిధాన్ సదన్‌లో నిర్వహించిన ‘నో యువర్ లీడర్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో లభించిన ఈ అరుదైన అవకాశంతో జిల్లా, పాఠశాలకు భవ్య శ్రీ గుర్తింపు తీసుకొచ్చారు. ఆమె ప్రతిభను గుర్తించిన జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ ఘనంగా సత్కరించి అభినందించారు. యువత ప్రతిభను ప్రోత్సహిస్తే జాతీయ స్థాయిలో మరింత ఉన్నతంగా రాణించగలరని కలెక్టర్ పేర్కొన్నారు. భవ్య శ్రీ విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు.
