Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నైన్త్ బెటాలియన్ దీక్షిత్ పరేడ్‌లో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నైన్త్ బెటాలియన్ దీక్షిత్ పరేడ్‌లో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ

వార్త ముఖ్యాంశాలు

  • వెంకటగిరి పరిధిలోని వల్లివేడు వద్ద నైన్త్ బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షిత్ పరేడ్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు.
  • మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణతో కలిసి కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
  • అనంతరం పరేడ్‌ను పరిశీలించిన ఆయన పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, ప్రతిభను అభినందించారు.

వెంకటగిరి పరిధిలోని వల్లివేడు వద్ద నైన్త్ బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షిత్ పరేడ్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణతో కలిసి కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పరేడ్‌ను పరిశీలించిన ఆయన పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, ప్రతిభను అభినందించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పోలీసు అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. బెటాలియన్ సిబ్బంది నిర్వహించిన పరేడ్ ఆకట్టుకుందని ఎమ్మెల్యే తెలిపారు. విధి నిర్వహణలో పోలీసులు చూపుతున్న అంకితభావం అభినందనీయమన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం అధికారులు, పోలీసు సిబ్బందిని అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *