Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు 21వ డివిజన్‌లో జనసేన ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • కూటమి అభ్యర్థులకు ప్రజామద్దతు పెరుగుతోంది: కిషోర్ గునుకుల నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 21వ డివిజన్‌లో జనసేన నాయకులు కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
  • రామజీ నగర్‌లోని 5, 6వ వీధుల్లో ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.
  • పలువురు కుటుంబాలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపాయని జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల వెల్లడించారు.

కూటమి అభ్యర్థులకు ప్రజామద్దతు పెరుగుతోంది: కిషోర్ గునుకుల
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 21వ డివిజన్‌లో జనసేన నాయకులు కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రామజీ నగర్‌లోని 5, 6వ వీధుల్లో ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. పలువురు కుటుంబాలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపాయని జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతోందని పేర్కొన్నారు. నెల్లూరు అభివృద్ధికి మంత్రి నారాయణ కృషి చేస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాగేంద్ర బాలు, నరహరి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, ప్రవల్లిక, ప్రశాంతి, సుప్రియ, విజయ, ఆమని, శ్రీలక్ష్మి, కృష్ణవేణి, కల్పన, పద్మ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *