Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
క్రైమ్

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు భారీ సుఫారీ సమాచారం కలకలం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు భారీ సుఫారీ సమాచారం కలకలం

వార్త ముఖ్యాంశాలు

  • ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ నెల్లూరు నెల్లూరు లో ఫ్యాక్షన్ రాజకీయాలు తెరమీదకు వచ్చాయి.
  • నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు భారీ సుఫారీ సమాచారం కలకలం సృష్టించింది.
  • రాజకీయవర్గాల్లో కలవరం సృష్టించింది.

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ నెల్లూరు

నెల్లూరు లో ఫ్యాక్షన్ రాజకీయాలు తెరమీదకు వచ్చాయి. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు భారీ సుఫారీ సమాచారం కలకలం సృష్టించింది. రాజకీయవర్గాల్లో కలవరం సృష్టించింది. ఈ మేరకు ఓ వీడియో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అంటూ రౌడీషీటర్ల సంబాషణలు వెలుగు చూశాయి. ఆయన్ను చంపేందుకు ఐదుగురు రౌడీషీటర్లు మాస్టర్‌ ప్లాన్‌ వేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు పక్కా ప్లాన్‌ వేసినట్లు సమాచారం బయటకు రావడంతో సంచలనం చెలరేగింది. “చంపితే డబ్బే డబ్బు” అంటూ రౌడీషీటర్ల సంభాషణలతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఎమ్మెల్యే ప్రాణాలకు ముప్పు ఉందన్న ఆందోళన నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *