వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు మహిళా చైతన్యం నెల్లూరుజిల్లా మహిళలు పలురంగాలలో చైతన్య వంతులుగా నిలిచారు.
- 1930 ప్రాంతాల నుండి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు, సమాజసేవలో తరించారు.
- స్త్రీ విద్యకు, స్త్రీ జనోద్ధరణకు, ఖద్దరు వస్త్రధారణకు, విదేశీ వస్తు బహిష్కరణకు ఉద్యమించారు.
సారా వ్యతిరేకోద్యమం – శంఖం పూరించిన రోశమ్మ
నెల్లూరు జిల్లాలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మహిళల సంఖ్య తక్కువేమీ కాదు. 1964 – 70లో రాజ్యసభకు ఎం.ఎల్. మేరినాయుడు ఎన్నికైనారు. పార్ల మెంటు సభ్యులుగా 91-96 వరకు కుడుముల పద్మశ్రీ (కాంగ్రెసు), 1996,1998,2004 ఎన్నికలలో పనబాక లక్ష్మి (కాంగ్రెసు), 1999-2004 వరకు ఉక్కాల రాజేశ్వరమ్మ (తెలుగుదేశం) ఎన్నికైనారు. వీరిలో పనబాక లక్ష్మి కేంద్ర మంత్రిగా పనిచేశారు. వెంకటగిరి అసెంబ్లీ నుంచి రెండు సార్లు 1999, 2004లో ఎన్నికైన నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఐదేళ్లపాటు విద్యాశాఖ మంత్రిగా, మాతా, శిశు సంరక్షణశాఖ మంత్రిగా పదవుల నలంకరించారు. రాష్ట్ర క్యాబినెట్ మంత్రి పదవి పొందిన జిల్లా తొలి మహిళగా గుర్తింపు పొందారు. మాగుంట పార్వతమ్మ ఒకసారి ఒంగోలు పార్లమెంటుస్థానానికి, ఒకసారి కావలి అసెంబ్లీ స్ధానానికి ఎన్నికైనారు. నెల్లూరు జిల్లా పరిషత్తు అధ్యక్ష పదవికి ఎం. నాగభూషణమ్మ ఎన్నికైనారు.
నెల్లూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఒకసారి తాళ్లపాక అనూరాధ (తెలుగుదేశం), కార్పొరేషన్‌గా ఏర్పడిన తర్వాత పులిమి శైలజ(కాంగ్రెసు),
ఆ తర్వాత నంది మండలం భానుశ్రీ(కాంగ్రెస్) మేయరు పదవుల నలంకరించారు. గూడూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కోడూరు కల్పలత పనిచేశారు. ఆ తర్వాత యారం మంజుల వచ్చారు. 2014లో పొణకా దేవసేన ఎన్నిక య్యారు. కావలి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా పోతుగంటి అలేఖ్య ఎన్నికయ్యారు.