Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు కార్పొరేషన్‌కు ఏకగ్రీవ అభ్యర్థులు వీరే

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు కార్పొరేషన్‌కు ఏకగ్రీవ అభ్యర్థులు వీరే

వార్త ముఖ్యాంశాలు

  • మొత్తం 8 మంది - అందరూ టీడీపీ నుంచే - రూరల్ నియోజకవర్గానికి చెందినవారే నవంబర్ నెల 1వ తేదీన జరిగే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన అనంతరం 8 మంది టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
  • పరిశీలనలో వారి ప్రత్యర్థులు సరైన పత్రాలు దాఖలు చేయనందున ప్రత్యర్థులు పోటీ నుంచి వైదొలిగారు.
  • దీంతో నెల్లూరు కార్పొరేషన్‌కు పరిశీలన అనంతరం 8 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మొత్తం 8 మంది
– అందరూ టీడీపీ నుంచే
– రూరల్ నియోజకవర్గానికి చెందినవారే
నవంబర్ నెల 1వ తేదీన జరిగే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన అనంతరం 8 మంది టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. పరిశీలనలో వారి ప్రత్యర్థులు సరైన పత్రాలు దాఖలు చేయనందున ప్రత్యర్థులు పోటీ నుంచి వైదొలిగారు. దీంతో నెల్లూరు కార్పొరేషన్‌కు పరిశీలన అనంతరం 8 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారు ఈ కింది విధంగా ఉన్నారు.

36వ డివిజన్ నుంచి టీడీపీకి చెందిన బుడ్డా సుప్రజ, 38వ డివిజన్ నుంచి మన్నేపల్లి నీలిమ, 39వ డివిజన్ నుంచి అత్తివరపు మల్లేశ్వరి, 40వ డివిజన్ నుంచి ఆర్. అభిషేక్, 41వ డివిజన్ నుంచి పల్నాటి అపర్ణ, 44వ డివిజన్ నుంచి భీమినేని వేదశ్రీ, 46వ డివిజన్ నుంచి షేక్ షంషుద్దీన్, 47వ డివిజన్ నుంచి తాళ్లూరి అవినాష్‌లు ఉన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *