వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ హవా కొనసాగుతుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. టీడీపీ క్యాంపు కార్యాలయం సంబరాలతో హోరెత్తింది. మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ సమక్షంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ పాటలకు అనుగుణంగా డ్యాన్సులు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నేతలతో కలిసి ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల ఫలితాలతో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. పార్టీ కార్యాలయమంతా నినాదాలు, కేరింతలతో మార్మోగింది.
Uploaded Video: