Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

*నీటి ఎద్దడి నివారణకు చర్యలు: గంటా*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
*నీటి ఎద్దడి నివారణకు చర్యలు: గంటా*

వార్త ముఖ్యాంశాలు

  • విశాఖపట్నం, సెప్టెంబర్ 13:_ నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.
  • నీటి ఎద్దడిపై మున్సిపల్ మంత్రి నారాయణ సహా విశాఖ, విజయనగరం జిల్లాల కలెక్టర్లు, జీవీఎంసీ కమిషనర్, నీటిసరఫరా అధికారులతో ఆదివారం ఫోన్ లో మాట్లాడారు.
  • కనీస అవసరాలకు సైతం నీరు లేక ఎంవీవీ సిటీ ఫ్లాట్ లలో నివాసముంటున్న వారు ఎదుర్కొంటున్న ఇబ్బందిని అధిగమించేలా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని సూచించారు.

విశాఖపట్నం, సెప్టెంబర్ 13:_ నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. నీటి ఎద్దడిపై మున్సిపల్ మంత్రి నారాయణ సహా విశాఖ, విజయనగరం జిల్లాల కలెక్టర్లు, జీవీఎంసీ కమిషనర్, నీటిసరఫరా అధికారులతో ఆదివారం ఫోన్ లో మాట్లాడారు. కనీస అవసరాలకు సైతం నీరు లేక ఎంవీవీ సిటీ ఫ్లాట్ లలో నివాసముంటున్న వారు ఎదుర్కొంటున్న ఇబ్బందిని అధిగమించేలా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని సూచించారు. 6 కిలో లీటర్లు, 12 కిలో లీటర్ల ట్యాంకర్ల ద్వారా 1.44 లక్షల లీటర్ల నీటిని ఎంవీవీ సిటీకి సరఫరా చేసినట్టు తెలిపారు. నీటి సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్లు పంపాలన్నారు. వర్షాభావం వల్ల తాగునీరు సహా వాడుక నీటి సమస్య తలెత్తిందని, మధురవాడ పరిసర ప్రాంత ప్రజలకు నీటి కష్టాలు తీర్చడానికి రూ.550 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నట్టు పేర్కొన్నారు. తాగునీటి ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని విశాఖ ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి తాటిపూడి రిజర్వాయర్ నుంచి సరఫరా పునరుద్ధరణ అత్యావశ్యకమని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ నీరు అందుబాటులోకి వస్తే ప్రజలకు ఎలాంటి సమస్య ఉండదన్నారు. స్థానికంగా ఉన్న నీటి వనరుల నుంచి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీరందించే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. మధురవాడ, భీమిలి జోన్ లలో నీటి సమస్య తీవ్రత తగ్గించేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *