Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

నిర్మల్ రూరల్: మెడిపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

శ్రీహరిరావు ప్రత్యేక చొరవతో గ్రామానికి రూ.3.50 కోట్ల అభివృద్ధి పనులు
పున్నమి ప్రతినిధి – అబ్దుల్ సాదిక్
నిర్మల్ రూరల్: నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్‌రెడ్డి ఆధ్వర్యంలో మెడిపల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు ప్రత్యేక చొరవతో గ్రామంలో 50 ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు లభించిందని తెలిపారు.
ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కానుండటంతో పాటు ఎస్‌హెచ్‌–44 నుంచి మెడిపల్లి వరకు డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు రూ.3.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని సోమ భీమ్‌రెడ్డి పేర్కొన్నారు.
గ్రామాభివృద్ధికి ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రానున్న రోజుల్లో మెడిపల్లిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.

నిర్మల్ రూరల్: మెడిపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం

నిర్మల్ రూరల్: మెడిపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *