Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

నిర్మల్‌లో ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఇద్గాం చౌరస్తాలో మిస్సైల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: అబ్దుల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నిర్మల్‌లో ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఇద్గాం చౌరస్తాలో మిస్సైల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: అబ్దుల

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్, పున్నమి ప్రతినిధి: భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను నిర్మల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
  • ఏపీజే అబ్దుల్ కలాం సంఘం, తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
  • ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యువత డాక్టర్ అబ్దుల్ కలాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని విద్యారంగంలో రాణించడంతోపాటు దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నిర్మల్, పున్నమి ప్రతినిధి: భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను నిర్మల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఏపీజే అబ్దుల్ కలాం సంఘం, తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యువత డాక్టర్ అబ్దుల్ కలాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని విద్యారంగంలో రాణించడంతోపాటు దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని సూచించారు.
మిస్సైల్ విగ్రహ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి
నిర్మల్‌లోని ఇద్గాం చౌరస్తాలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్మారకంగా మిస్సైల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఏపీజే అబ్దుల్ కలాం సంఘం ప్రధాన కార్యదర్శి అబ్దుల్ జావిద్ కోరారు. గతంలో మున్సిపల్ పాలకవర్గం ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చినప్పటికీ, ఇప్పటివరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. ప్రస్తుత మున్సిపల్ పాలకవర్గం చొరవ తీసుకొని విగ్రహ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మంజూరు చేసి, పనులను త్వరితగతిన ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీజే అబ్దుల్ కలాం సంఘం అధ్యక్షుడు అజర్ ఉద్దీన్, తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం అధ్యక్షుడు షేక్ ముజాహిద్, బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఐటీ సెల్ జిల్లా నాయకుడు రిజ్వాన్ ఖాన్, కలాం గుణం వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి ఇంతియాజ్ అహ్మద్, అబ్దుల్ జావిద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *