వార్త ముఖ్యాంశాలు
- చెన్నరావుపేట (పున్నమి ) స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ కల్లెపు శోభరాణి ఆధ్వర్యంలో 25 మంది నిరు పేద వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేశారు.
- అనంతరం చైర్మన్ మాట్లాడుతు శామ్ దాసాని ఫౌండేషన్ షిర్డీ సాయిబాబా ఇండియ వారి సహకారంతో స్థానిక నిరు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.
- ఇంత గొప్ప అవకాశం మా సంస్థ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గౌరవంగ ఉంది.
చెన్నరావుపేట (పున్నమి ) స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ కల్లెపు శోభరాణి ఆధ్వర్యంలో 25 మంది నిరు పేద వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతు శామ్ దాసాని ఫౌండేషన్ షిర్డీ సాయిబాబా ఇండియ వారి సహకారంతో స్థానిక నిరు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.
ఇంత గొప్ప అవకాశం మా సంస్థ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గౌరవంగ ఉంది. శామ్ దాసని పౌండేషన్ షిర్డీ సాయిబాబా ఇండియ నిర్వాహకులకు మా సంస్థ మరియు నిరుపేద వృద్ధుల పక్షాణ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది నిరుపేదలకు చేతురుతులపైన ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టి ఎంతోమంది మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు ఎంతగానో కృషి చేయడం జరిగింది అంతేకాకుండా నిరుద్యోగ యువతీ యువకులకు పలు రకాల వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపట్టి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. సమాజంలో పేరుకుపోయిన ఎన్నో సమస్యల పైన గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఉన్న ప్రజలకు సంబంధిత అంశాలపైన అవగాహన సదస్సులు చేపట్టి వారిని చైతన్య మార్గంలో నడిపించడం జరిగింది. హస్తకళలలో వివిధ రకాల శిక్షణ ఇవ్వడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, బడి మానేసిన పిల్లలను పాఠశాలకు పంపడం, ఒంటరి మహిళలకు సహాయం చేయడం, ప్రజలకు కొన్ని ముఖ్యమైన చట్టాలపై అవగాహన కల్పించి వారిలో చైతన్యం కలిగించడం జరిగింది. రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికుల కోసం వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం వంటి ఆశయాలను పరిగణనలోకి తీసుకుని, మాకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు శామ్ దాసాని ఫౌండేషన్ సాయిబాబా ఇండియాకు నిర్వాహకులకు మరో సారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ పెద్దలు తోట బిక్షపతి మరియు లావుడ్య అనూష , రాజేందర్, రాము, సరోజనతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.