Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యం: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యం: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

వార్త ముఖ్యాంశాలు

  • నందిగామ ప్రతినిధి నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యేతంగిరాల సౌమ్య పేర్కొన్నారు.
  • యువతకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు.
  • నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్ ఎన్జీవో హోమ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువత కు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిర్వహించిన జాబ్ మేళాలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు.

నందిగామ ప్రతినిధి

నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యేతంగిరాల సౌమ్య పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్ ఎన్జీవో హోమ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువత కు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిర్వహించిన జాబ్ మేళాలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువతలో ఉన్న నైపుణ్యాలను గుర్తించి, వారి అర్హతలకు అనుగుణం గా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇస్తూ యువతకు మెరుగైన భవిష్యత్తు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ జాబ్ మేళాకు సుమారు 10 ప్రముఖ కంపెనీలు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన 18 నుంచి 35 సంవత్సరాల లోపు యువతీ యువకులు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు వారి విద్యార్హతలు, ఉద్యోగ బాధ్యతలకు అనుగుణంగా నెలకు రూ.12,000 నుంచి రూ.35,000 వరకు వేతనం లభించే అవకాశం ఉందని తెలిపారు. నందిగామతో పాటు ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు.“యువతకు ఉద్యోగం.. ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా” అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, నైపుణ్యాభి వృద్ధి కార్యక్రమాల ద్వారా యువతను ఉద్యోగ మార్కెట్‌ తో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, APSSDC అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, నిరుద్యోగ యువత తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *