Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సాహితీ

నా అక్షరం : నిట్టల. సీతారామ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నా అక్షరం : నిట్టల. సీతారామ్

వార్త ముఖ్యాంశాలు

  • ఎక్కుపెట్టిన ఒక శరం విప్లవించే ఒక స్వరం ఆవేశంలో దుముకే జలపాతం ఆవేదన లోపలికే భూపాలం అన్నార్తుల హాహా కారం క్షతగాత్రుల యుద్దారావం పీడిత ప్రజల గుండెల్లో కణ కణ మండే అగ్ని కణం శ్రామికుల ఎదల లో దీపంగా వెలిగే ఆశాభావం గుండెతో మాట్లాడే నా…
  • సీతారామ్

ఎక్కుపెట్టిన ఒక శరం
విప్లవించే ఒక స్వరం
ఆవేశంలో దుముకే జలపాతం
ఆవేదన లోపలికే భూపాలం
అన్నార్తుల హాహా కారం
క్షతగాత్రుల యుద్దారావం
పీడిత ప్రజల గుండెల్లో
కణ కణ మండే అగ్ని కణం
శ్రామికుల ఎదల లో
దీపంగా వెలిగే ఆశాభావం
గుండెతో మాట్లాడే నా అక్షరం

జాతి చైతన్యాని కి అంకితం నిరంతరం
నిట్టల. సీతారామ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *