Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

నాయుడుపేట లో వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన ర్యాలీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నాయుడుపేట లో వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన ర్యాలీ

వార్త ముఖ్యాంశాలు

  • ఆగష్టు 6 పున్నమి ప్రతినిధి దొరవారిసత్రం వాట్సాప్ గవర్నెన్స్ (మనమిత్ర యాప్)పై మంగళవారం నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా ఆధ్వర్యంలో నాయుడుపేట పట్టణంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు.డిజిటల్ సేవలలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ (మనమిత్ర యాప్) ప్రజల చేతిలో ప్రభుత్వం అనే పోస్టర్ తో సేవలపై…
  • ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది, సచివాలయ, మెప్మా,సిబ్బంది పాల్గొన్నారు.

ఆగష్టు 6 పున్నమి ప్రతినిధి దొరవారిసత్రం

వాట్సాప్ గవర్నెన్స్ (మనమిత్ర యాప్)పై మంగళవారం నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా ఆధ్వర్యంలో నాయుడుపేట పట్టణంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు.డిజిటల్ సేవలలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ (మనమిత్ర యాప్) ప్రజల చేతిలో ప్రభుత్వం అనే పోస్టర్ తో సేవలపై నినాదాలతో,
అవగాహన కల్పిస్తూ,ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ షేక్.ఫజులుల్లా మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకురావడం జరిగిందని,26 శాఖలకు చెందిన 530 కు పైగా సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచారని,వాట్సాప్ లో 9552300009 అనే నంబర్ కు హాయ్ చెప్పి అన్ని సేవలు హాయిగా పొందవచ్చన్నారు.మనమిత్ర–
వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు ప్రతి నెల 5వ తేదీన అన్ని గ్రామ సచివాలయాల పరిధిలో ర్యాలీలను నిర్వహించి,పూర్తి అవగాహన కల్పించాలని సచివాలయ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది, సచివాలయ, మెప్మా,సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *