వార్త ముఖ్యాంశాలు
- ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 23 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం వీరంపల్లి పంచాయతీ నాయుడుపల్లి (మడ) గ్రామంలోని రామాలయంలో గురువారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు.
- ఆలయ ప్రహరీ గోడ దూకి, గ్రిల్స్ విరిచి లోపలికి ప్రవేశించిన దుండగులు సీతమ్మవారి రెండు తాళిబొట్లు అపహరించారు.
- ఆలయంలోని బీరువాను తెరిచేందుకు ప్రయత్నించినా విఫలమయ్యారు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 23 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం వీరంపల్లి పంచాయతీ నాయుడుపల్లి (మడ) గ్రామంలోని రామాలయంలో గురువారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయ ప్రహరీ గోడ దూకి, గ్రిల్స్ విరిచి లోపలికి ప్రవేశించిన దుండగులు సీతమ్మవారి రెండు తాళిబొట్లు అపహరించారు. ఆలయంలోని బీరువాను తెరిచేందుకు ప్రయత్నించినా విఫలమయ్యారు. శుక్రవారం ఉదయం చోరీని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. మూడు రోజుల క్రితం వడ్లపూడిలోని పొన్నూరమ్మ ఆలయంలోనూ చోరీ జరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వరుస ఆలయ చోరీల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి దొంగలను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.