వార్త ముఖ్యాంశాలు
- నాగారం/ఎదులాబాద్, అక్టోబర్ 14 (పున్నమి రిపోర్టర్ - సందీప్): కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే లక్ష్యంగా నాగారం, ఎదులాబాద్ డివిజన్ల పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీ కమిటీలను బుధవారం ప్రకటించారు.
- మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఈ నూతన కమిటీలను అధికారికంగా వెల్లడించారు.
- ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ..
నాగారం/ఎదులాబాద్, అక్టోబర్ 14 (పున్నమి రిపోర్టర్ – సందీప్):
కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే లక్ష్యంగా నాగారం, ఎదులాబాద్ డివిజన్ల పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీ కమిటీలను బుధవారం ప్రకటించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఈ నూతన కమిటీలను అధికారికంగా వెల్లడించారు.
ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. నూతనంగా నియమితులైన కమిటీ బాధ్యులు, నాయకులు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజా సంక్షేమ పథకాలను నిరుపేదలకు వివరిస్తూ, ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు.
నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలని, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే ధ్యేయంగా సమష్టిగా శ్రమించాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, ఎదులాబాద్ డివిజన్ అధ్యక్షుడు సామల అమర్, నాగారం డివిజన్ అధ్యక్షుడు భూమయ్య యాదవ్, నాగారం మున్సిపాలిటీ మాజీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డిలతో పాటు నూతన కమిటీ సభ్యులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.