Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ :రవిదాస్ జయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నాగర్ కర్నూల్ :రవిదాస్ జయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

వార్త ముఖ్యాంశాలు

  • నాగర్‌కర్నూల్‌ జిల్లా భాజపా దళిత మోర్చా ఆధ్వర్యంలో సంత్ గురు రవిదాస్ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్‌ను మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు.
  • ఈ సందర్భంగా దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు భూషయ్య మాట్లాడుతూ..
  • హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించే సంత్ గురు రవిదాస్ జయంతి మహా సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా భాజపా దళిత మోర్చా ఆధ్వర్యంలో సంత్ గురు రవిదాస్ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్‌ను మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు భూషయ్య మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించే సంత్ గురు రవిదాస్ జయంతి మహా సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమతా మమతలు, భ్రాతృత్వాన్ని ప్రబోధించిన రవిదాస్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని కోరారు. జిల్లా నలుమూలల నుంచి నాయకులు, ప్రజలు వేలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్ గౌడ్, దళిత మోర్చా నాయకులు రేణయ్య, శంకర్, రాము పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *