Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

నష్టాల సత్వర అంచనాలకు డ్రోన్ సాంకేతికత వినియోగం ప్రతి మండలానికి ప్రత్యేక డ్రోన్ సర్వే బృందం ఏర్పాటు తక్కువ సమయంలో కచ్చిత మైన, పారదర్శక నివేదికల తయారీకి అవకాశం ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నష్టాల సత్వర అంచనాలకు డ్రోన్ సాంకేతికత వినియోగం ప్రతి మండలానికి ప్రత్యేక డ్రోన్ సర్వే బృందం ఏర్పాటు తక్కువ సమయంలో కచ్చిత మైన, పారదర్శక నివేదికల తయారీకి అవకాశం ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ

వార్త ముఖ్యాంశాలు

  • ఎన్‌టీఆర్ జిల్లాలో మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంటలు, రహదారులు, వంతెనలు, గృహాలు తదితర మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాన్ని వేగవంతంగా, కచ్చితం గా, పారదర్శకంగా అంచనా వేసేందుకు డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు.
  • బుధవారం కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (CCC) లో కలెక్టర్ లక్ష్మీశ తుఫాను నష్టాల ప్రాథమిక అంచనాల కోసం డ్రోన్ కార్పొరేషన్ అందించిన డ్రోన్ల పనితీరును పరిశీలించారు.
  • ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ “తుఫాను ప్రభావిత ప్రజలకు వేగంగా సహాయ సహకారాలు అందించేందుకు, ఆధునిక సాంకేతికత కీలకంగా పనిచేస్తోంది.

ఎన్‌టీఆర్ జిల్లాలో మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంటలు, రహదారులు, వంతెనలు, గృహాలు తదితర మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాన్ని వేగవంతంగా, కచ్చితం గా, పారదర్శకంగా అంచనా వేసేందుకు డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు.
బుధవారం కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (CCC) లో కలెక్టర్ లక్ష్మీశ తుఫాను నష్టాల ప్రాథమిక అంచనాల కోసం డ్రోన్ కార్పొరేషన్ అందించిన డ్రోన్ల పనితీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ “తుఫాను ప్రభావిత ప్రజలకు వేగంగా సహాయ సహకారాలు అందించేందుకు, ఆధునిక సాంకేతికత కీలకంగా పనిచేస్తోంది. జిల్లాలోని 20 మండలాలకు ఒక్కో డ్రోన్ సర్వే టీమ్‌ను నియమించాము. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే, డ్రోన్ సాంకేతికత ద్వారా తక్కువ సమయంలో పెద్ద విస్తీర్ణంలోని నష్టాన్ని కచ్చితంగా గుర్తించవచ్చు,” అని అన్నారు.
హై రిజల్యూషన్ చిత్రాలు, వీడియో ఫుటేజీ ద్వారా కూడా అంచనా ప్రక్రియను మరింత సులభతరం చేయవచ్చని ఆయన వివరించారు.
మానవులు వెళ్లేందుకు ఇబ్బందికరమైన ప్రాంతాల్లో కూడా డ్రోన్లు చేరి అక్కడి పరిస్థితులను విశ్లేషించేందుకు వీలు కల్పిస్తాయన్నారు.
డిజిటల్ మ్యాపులు, ఫోటోలు, 3D నమూనాల రూపంలో పంటనష్టం నివేదికలు రూపొందించడం ద్వారా పారదర్శకతను మరింత పెంచవచ్చని కలెక్టర్ తెలిపారు.
పునరుద్ధరణ పనులకు మద్దతు
డ్రోన్ సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా పునరుద్ధరణ మరియు పునర్నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టవచ్చని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ప్రజల కు అవసరమైన సహాయాన్ని త్వరగా, సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *