చెన్నరావుపేట :(పున్నమి తెలుగు దినపత్రిక )
ఈ నెల 22వ తేదీన హన్మకొండ లోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించనున్న స్వేరో ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు నర్సంపేట పట్టణంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది.
నర్సంపేట పట్టణలోని కల్లేపేల్లి సురేష్ (నియోజకవర్గ కన్వీనర్) మరియు బి.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షులు శ్రీ నాగేల్లి వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణంలోని 30 వార్డులకు సంబంధించిన బీ.ఆర్.ఎస్ కౌన్సిలర్లు, కౌన్సిలర్ అభ్యర్థులు, ముఖ్య నాయకులు పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వేరో ఉద్యమం విద్య, ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం, ఐక్యత వంటి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా నిలుస్తోందని తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ విద్యావంతులై, సంఘటితమై, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
“జై భీమ్ – జై స్వేరో” అనే నినాదంతో విద్యా చైతన్యం, సామాజిక సమానత్వం, ఆత్మగౌరవ భావాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు.
ఈ నెల 22న హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో జరిగే స్వేరో ఆత్మీయ సమ్మేళనానికి నర్సంపేట పట్టణం నుండి స్వేరో అభిమానులు, విద్యార్థులు, యువత, మేధావులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు.
ఇట్టి కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ ముఖ్య నాయకులు రాయుడు దుష్యంత్ రెడ్డి గారు, మండల శ్రీనివాస్ గారు, దొమ్మటి సంతోష్ గారు, బుస రాజు గారు, గోనెల యువరాజ్ గారు, మంద ప్రసాద్ గారు, మండల కుమారస్వామి గారు చింతల టార్జాన్ గారు, పెండెం వెంకటేశ్వర్లు గారు, సంపంగి సాలయ్య గారు, పైసా ప్రవీణ్ గారు, తోటకూరి సదానందం గారు, మరియు స్వేరో టీం, స్టీరింగ్ కమిటీ, నియోజకవర్గ, మండల, గ్రామాల, మరియు వార్డుల కన్వీనర్, కో కన్వీనరస్ అయిన శ్రీ కొమ్ముల కర్ణాకర్ గారు, దౌడు రవి, వేల్పుల శ్రీనివాస్ గారు, నీలమర్రి నాగరాజు గారు, దినేష్ గారు, మధు గారు, పుట్ట విక్రమ్ గారు, ఇశ్రం స్వాతి గారు, బోయిని లక్ష్మణ్ గారు , శివ గారు, శంకర్ గారు, మంద రాజేష్ గారు, చెరుపెల్లి ప్రవీణ్ గారు, కట్యాల చోటు, రాజశేఖర్, సారయ్య గారు, జన్ను స్వామి గారు, బరిగేల సురేష్ గారు, యం.ప్రవీణ్ (చిన్న) గార్లు, తదితరులు పాల్గొనడం జరిగినది..

వార్తా మూలాలు
- Praveenపత్రికా ప్రకటన