Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

నంద్యాలలో ఘనంగా నాగులచవితి వేడుకలు పుట్టలకు పోటెత్తిన భక్తజనం.. పాలు పోసి ప్రత్యేక పూజలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నంద్యాలలో ఘనంగా నాగులచవితి వేడుకలు పుట్టలకు పోటెత్తిన భక్తజనం.. పాలు పోసి ప్రత్యేక పూజలు

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల : నాగులచవితి సందర్భంగా నంద్యాల పట్టణంలో ఆదివారం వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి.
  • తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల్లోని నాగుల పుట్టల వద్దకు భక్తులు భారీగా తరలివచ్చి పూజలు నిర్వహించారు.కోదండరామాలయం, చెరువు కట్ట, ఎస్‌బీఐ కాలనీ, ఎంజీఓస్ కాలనీ, బస్టాండ్, బొమ్మలసత్రం తదితర ప్రాంతాల్లో పుట్టలకు పాలు పోసి చలిమిడి, వడపప్పు, పండ్లు నైవేద్యంగా సమర్పించారు.
  • కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని నాగేంద్రస్వామిని ప్రార్థించారు.కానాల గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనూ నాగులచవితి వేడుకలు వైభవంగా జరిగాయి.

నంద్యాల : నాగులచవితి సందర్భంగా నంద్యాల పట్టణంలో ఆదివారం వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల్లోని నాగుల పుట్టల వద్దకు భక్తులు భారీగా తరలివచ్చి పూజలు నిర్వహించారు.కోదండరామాలయం, చెరువు కట్ట, ఎస్‌బీఐ కాలనీ, ఎంజీఓస్ కాలనీ, బస్టాండ్, బొమ్మలసత్రం తదితర ప్రాంతాల్లో పుట్టలకు పాలు పోసి చలిమిడి, వడపప్పు, పండ్లు నైవేద్యంగా సమర్పించారు. కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని నాగేంద్రస్వామిని ప్రార్థించారు.కానాల గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనూ నాగులచవితి వేడుకలు వైభవంగా జరిగాయి. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *