వసంత హైమావతి గారి మృతి పట్ల సంతాపం.
వసంత కుటుంబానికి ప్రముఖుల పరామర్శ.
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ | 28-11-2026
మాజీ హోంశాఖ మంత్రి వర్యులు వసంత నాగేశ్వరరావు గారి సతీమణి, మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి మాతృమూర్తి వసంత హైమావతి గారి మృతి నేపథ్యంలో శనివారం ఐతవరం గ్రామంలోని వారి నివాసానికి పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు విచ్చేసి వసంత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) గారు, నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు గారు, విజయవాడ తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్దా వెంకన్న గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త మలినేని రాజయ్య గారు, సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారు, తెలుగుదేశం నాయకులు కోగంటి రామరావు గారు, ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు గారు తదితరులు మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు గారు, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారిని కలిసి తమ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా వసంత హైమావతి గారి మరణం ఆ కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జీవిత భాగస్వామిని కోల్పోయిన వసంత నాగేశ్వరరావు గారు, మాతృమూర్తిని కోల్పోయిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారితో పాటు ఇతర కుటుంబ సభ్యులను పలకరించి, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని, మనోస్థైర్యాన్ని కలిగి ఉండాలని ఆకాంక్షించారు.

