Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

నందలూరు జెడ్పి హైస్కూల్ ప్రాంగణంలో ‘సెంట్రల్ కిచెన్’ నిర్మాణం వద్దు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నందలూరు జెడ్పి హైస్కూల్ ప్రాంగణంలో ‘సెంట్రల్ కిచెన్’ నిర్మాణం వద్దు

వార్త ముఖ్యాంశాలు

  • నందలూరు జెడ్పి హైస్కూల్ ప్రాంగణంలో 'సెంట్రల్ కిచెన్' నిర్మాణం వద్దు సిటిజన్స్ అసోసియేషన్ డిమాండ్ నందలూరు, 29 ఆగస్టు 2026 నందలూరు మండలానికి మంజూరైన 'సెంట్రల్ కిచెన్' (స్మార్ట్ కిచెన్) నిర్మాణాన్ని నందలూరు జెడ్పి హైస్కూల్ ప్రాంగణంలో కాకుండా వేరొక అనుకూలమైన స్థలానికి మార్చాలని 'సిటిజన్స్ అసోసియేషన్'…
  • పాఠశాల మైదానంలో సెంట్రల్ కిచెన్ నిర్మించడం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని అసోసియేషన్ నాయకులు ఎ.విశ్వనాథ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, ఆందోళన వ్యక్తం చేశారు.
  • ఈ నిర్మాణంతో క్రీడా ప్రాంగణం చిన్నదై విద్యార్థులు ఆటలు ఆడుకోవడానికి ఇబ్బందిగా మారడమే కాకుండా, పరిశుభ్రత లోపించి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

నందలూరు జెడ్పి హైస్కూల్ ప్రాంగణంలో ‘సెంట్రల్ కిచెన్’ నిర్మాణం వద్దు

సిటిజన్స్ అసోసియేషన్ డిమాండ్

నందలూరు, 29 ఆగస్టు 2026

నందలూరు మండలానికి మంజూరైన ‘సెంట్రల్ కిచెన్’ (స్మార్ట్ కిచెన్) నిర్మాణాన్ని నందలూరు జెడ్పి హైస్కూల్ ప్రాంగణంలో కాకుండా వేరొక అనుకూలమైన స్థలానికి మార్చాలని ‘సిటిజన్స్ అసోసియేషన్’ (విద్య, సాంస్కృతిక, క్రీడ మరియు సేవా సంస్థ) రాజంపేట సబ్‌కలెక్టర్‌ను కోరింది.
పాఠశాల మైదానంలో సెంట్రల్ కిచెన్ నిర్మించడం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని అసోసియేషన్ నాయకులు ఎ.విశ్వనాథ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్మాణంతో క్రీడా ప్రాంగణం చిన్నదై విద్యార్థులు ఆటలు ఆడుకోవడానికి ఇబ్బందిగా మారడమే కాకుండా, పరిశుభ్రత లోపించి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, నీరు నిలిచిపోయి మైదానం పూర్తిగా దెబ్బతింటుంది. వంటల పొగ,శబ్దాల వల్ల పక్కనే ఉన్న తరగతి గదుల్లో పాఠాల బోధనకు, విద్యార్థుల చదువుకు తీవ్ర విఘాతం కలుగుతుంది. దీనికి తోడు తయారు చేసిన భోజనాన్ని వాహనాల్లో బయటకు తరలించడానికి చుట్టుపక్కల వీధి రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయి.
కాబట్టి, విద్యార్థుల భవిష్యత్తును మరియు పాఠశాల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ ‘సెంట్రల్ కిచెన్’ నిర్మాణాన్ని వెంటనే వేరొక అనుకూలమైన ప్రదేశానికి మార్చాలని సిటిజన్స్ అసోసియేషన్ సబ్‌కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *