*దేవాలయానికి పథకం..*
*స్మశాన వాటికకు రోడ్డు..*
*ప్రజల ప్రధాన విజ్ఞప్తులు..*
*శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారి దేవాలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణతో పాటు ముదిరాజ్ సంఘీయులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా కీలకమైన అంశాలను సంబంధిత నాయకుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.*
*రామాలయానికి ప్రభుత్వం అమలు చేస్తున్న ధూప దీప నైవేద్య పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ముదిరాజ్ సంఘీయులకు సంబంధించిన స్మశాన వాటికకు సీసీ రోడ్డు మంజూరు చేయించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతూ రామాలయ కమిటీ, దేవాలయ సేవా సంఘం, ముదిరాజ్ సంఘీయుల ప్రతినిధులు ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు శ్రీ పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించారు.*
*ముదిరాజ్ సంఘీయుల సమస్యలను క్షుణ్ణంగా విని సమస్యల పరిష్కారానికై సంబంధిత అధికారులతో,ప్రజా ప్రతినిధులతో చర్చించి సమస్య పరిష్కారమయ్యేలా*
*తన వంతు కృషి చేస్తానని హమీ ఇచ్చిన కిరణ్, కుమార్ రెడ్డి…*

