Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

దుర్గానగర్ కాలనీలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుర్గానగర్ కాలనీలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు

ఎల్బీనగర్; కర్మన్‌ఘాట్, శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు సందర్భంగా దుర్గానగర్ కాలనీలో నిర్వహించిన దుర్గామాత పూజా కార్యక్రమంలో కర్మన్‌ఘాట్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు గోపాల్ ముదిరాజ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గానగర్ కాలనీ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆయన పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దుర్గానగర్ కాలనీ అధ్యక్షుడు వంగ జగన్నాథ్ రెడ్డి, కార్యదర్శి భూ రామ్ వెంకటేష్, కమిటీ సభ్యులు బత్తుల శ్రీనివాస్ రెడ్డి, సుబ్బూరు సందీప్ కుమార్, సల్వాడి సతీష్, రామకృష్ణ చారి, భాస్కర్ రావు, శ్రీనివాస్ గుప్తా, వేణు చారి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అలాగే కాలనీ మహిళా సోదరీమణులు బత్తుల హేమ, సల్వాడి శ్రీవాణి, వంగ మాధవి, సంధ్య, కవిత, అంజనమ్మ, వాణి, గీత, అనిత, విజయ, కల్పన, యాదగిరి రెడ్డి, స్వాతి తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొని దుర్గామాత ఆశీస్సులు పొందారు.

దుర్గానగర్ కాలనీలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు

దుర్గానగర్ కాలనీలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు

దుర్గానగర్ కాలనీలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *