Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు: రెండు మద్యం దుకాణాల్లో చోరీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
దుత్తలూరు: రెండు మద్యం దుకాణాల్లో చోరీ

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు మండలంలో రెండు మద్యం దుకాణాల్లో చోరీ ఘటనలు చోటుచేసుకున్నాయి.
  • దుత్తలూరు సెంటర్‌లోని నర్రవాడ మార్గంలో ఉన్న మద్యం దుకాణం గోడ పైభాగంలో కన్నం వేసి దుండగులు లోపలికి ప్రవేశించారు.
  • కొంత నగదుతో పాటు మద్యం సీసాలను అపహరించారు.

దుత్తలూరు మండలంలో రెండు మద్యం దుకాణాల్లో చోరీ ఘటనలు చోటుచేసుకున్నాయి. దుత్తలూరు సెంటర్‌లోని నర్రవాడ మార్గంలో ఉన్న మద్యం దుకాణం గోడ పైభాగంలో కన్నం వేసి దుండగులు లోపలికి ప్రవేశించారు. కొంత నగదుతో పాటు మద్యం సీసాలను అపహరించారు. అలాగే నందిపాడు గ్రామంలోని మద్యం దుకాణంలో రేకులపై ఉన్న కిటికీ ద్వారా ప్రవేశించి మద్యం సీసాలను చోరీ చేశారు. సిబ్బంది చోరీలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రెండు ఘటన స్థలాలను పరిశీలించి, వివరాలు నమోదు చేసుకున్నారు. చోరీకి పాల్పడిన వారిని గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. CCTV కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *