దుత్తలూరు: బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దుత్తలూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా నిర్వహించారు. ప్రచారంలో భాగంగా సోమలరేగడ, దుత్తలూరు, మండల నాయుడుపల్లి ఎస్టీ కాలనీ, నరవాడ ఎస్టీ, ఎస్సీ కాలనీలు, తెడ్డుపాడు, కొత్త తెడ్డుపాడు, తిమ్మాపురం, వెంకన్నపాలెం, కొత్తపేటతో పాటు దుత్తలూరులోని పలు కాలనీల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేపట్టారు. బహుజనుల హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ విధానాలను ప్రజలకు వివరించారు. ప్రచార కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
