Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు మండలంలోని ప్రతి గ్రామంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుత్తలూరు మండలంలోని ప్రతి గ్రామంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి

వార్త ముఖ్యాంశాలు

  • ఐక్యతతోనే అభ్యర్థుల విజయం సాధ్యం: మేకపాటి రాజగోపాల్ రెడ్డి దుత్తలూరు: స్థానిక ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ప్రతి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.
  • మండల కేంద్రమైన దుత్తలూరులోని జేఎస్ఆర్ ఫౌండేషన్‌లో మండలంలోని వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐకమత్యమే మహాబలమని, పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు.

ఐక్యతతోనే అభ్యర్థుల విజయం సాధ్యం: మేకపాటి రాజగోపాల్ రెడ్డి
దుత్తలూరు: స్థానిక ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ప్రతి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన దుత్తలూరులోని జేఎస్ఆర్ ఫౌండేషన్‌లో మండలంలోని వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐకమత్యమే మహాబలమని, పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *