Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

తెలంగాణ పోరాట స్ఫూర్తి, మహిళా శక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ: కలెక్టర్ దివాకర్ టి.ఎస్.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
తెలంగాణ పోరాట స్ఫూర్తి, మహిళా శక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ: కలెక్టర్ దివాకర్ టి.ఎస్.

ఖమ్మం
తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని, మహిళా శక్తిని ప్రపంచానికి చాటిన వీరనారి చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. అన్నారు. శనివారం చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సమీపంలో ఉన్న ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జయంతి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ సమాజంలో ఐలమ్మ పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరించి, హక్కుల సాధన కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. మహిళా సాధికారతకు ఐలమ్మ జీవితం ఆదర్శమని తెలిపారు. ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు పాల్గొని నివాళులర్పించారు.

తెలంగాణ పోరాట స్ఫూర్తి, మహిళా శక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ: కలెక్టర్ దివాకర్ టి.ఎస్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *