Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కాకినాడ

*తూర్పు – పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటరు జాబితా రూపకల్పనకు చర్యలు..* *-ఈఆర్ఓ,కాకినాడ డీఆర్వో డా.డి.తిప్పేనాయక్*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
*తూర్పు – పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటరు జాబితా రూపకల్పనకు చర్యలు..* *-ఈఆర్ఓ,కాకినాడ డీఆర్వో డా.డి.తిప్పేనాయక్*

వార్త ముఖ్యాంశాలు

  • కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 6 (పున్నమి న్యూస్): తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజక వర్గానికి సంబంధించి నూతన ఓటర్ల జాబితా రూపకల్పనకు ఉపాధ్యాయ అసోసియేషన్ ప్రతినిధులు తమ సహకారాన్ని అందించాలని తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఈఆర్ఓ,కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి డా.డి.తిప్పేనాయక్ కోరారు.
  • మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజక వర్గానికి సంబంధించి నూతన ఓటర్ల జాబితా రూపకల్పనపై వివిధ ఉపాధ్యాయ అసోసియేషన్ ప్రతినిధులతో డి ఆర్ ఓ...
  • జిల్లా విద్యాఅధికారి పి.రమేష్,డీఐఈవో జె.రాంబాబు తదితరులతో కలిసి సమావేశం నిర్వహించారు.

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 6 (పున్నమి న్యూస్):
తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజక వర్గానికి సంబంధించి నూతన ఓటర్ల జాబితా రూపకల్పనకు ఉపాధ్యాయ అసోసియేషన్ ప్రతినిధులు తమ సహకారాన్ని అందించాలని తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఈఆర్ఓ,కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి డా.డి.తిప్పేనాయక్ కోరారు.
మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజక వర్గానికి సంబంధించి నూతన ఓటర్ల జాబితా రూపకల్పనపై వివిధ ఉపాధ్యాయ అసోసియేషన్ ప్రతినిధులతో డి ఆర్ ఓ… జిల్లా విద్యాఅధికారి పి.రమేష్,డీఐఈవో జె.రాంబాబు తదితరులతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డి ఆర్ ఓ మాట్లాడుతూ.. త్వరలో ఖాళీగా కానున్న తూర్పు -పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు అవసరమైన ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించడం జరుగుతుందన్నారు.ఈ ప్రక్రియ కు సంబంధించి గత నెలలో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఓటు నమోదు చేసుకునేందుకు 2026 నవంబర్ 06వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. అలాగే నవంబర్ 25న డ్రాఫ్ట్ ఓటరు జాబితాను ప్రచురించడం జరుగు తుందని వివరించారు. ఈ డ్రాఫ్ట్ జాబితాపై క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ కు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. వచ్చిన అభ్యంతరాలు అన్నిటిని డిసెంబర్ 25వ తేదీ నాటికి పరిష్కరించి,2026 డిసెంబర్ 30న తుది ఓటరు జాబితాను ప్రచురించడం జరుగుతుందని ఈఆర్వో వెల్లడించారు.ఓటు నమోదుకు సంబంధించి ఫాం-19 ను అన్ని ఎంపీడీవో, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉంచడం జరిగిందని ఆయన తెలిపారు.ఈ ప్రక్రియకు సంబంధించి అధికారులకు..ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియ అంతా సజావుగా జరిగేందుకు ఆయా ఉపాధ్యాయ అసోసియేషన్ ప్రతినిధులు తమ సహకారాన్ని అందించాలని కోరారు.ఈ సమావేశంలో కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ఎం.జగన్నాథం వివిధ ఉపాధ్యాయ అసోసియేషన్ ప్రతినిధులు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *