Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సక్సెస్ స్టోరీస్

తూర్పుగోదావరి జిల్లా *రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు కు అవార్డుల పంట*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తూర్పుగోదావరి జిల్లా *రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు కు అవార్డుల పంట*

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083

తూర్పుగోదావరి రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు రికార్డు స్థాయి సేవా పురస్కారాలతో అద్భుత విజయాన్ని అందుకుంది.

విశాఖపట్నంలోని AMTZ ప్రాంగణంలో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డా. వై. కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించిన “కళ్యాణ ప్రశస్తి అవార్డ్స్ నైట్ (2025-26)” లో నిడదవోలు క్లబ్ ఏకంగా 17 ప్రధాన అవార్డులను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది.

2025 జూలై 1 నుండి 2026 జూన్ వరకు నిరంతరాయంగా నిర్వహించిన వినూత్న సేవా కార్యక్రమాలు, వివిధ సెమినార్లలో కనబరిచిన అసమాన ప్రతిభకు గాను మరో 11 పురస్కారాలు దక్కాయి. దీనితో మొత్తం 28 అవార్డులను సొంతం చేసుకుని డిస్ట్రిక్ట్ 3020 లోనే అత్యుత్తమ “బెస్ట్ క్లబ్” గా నిడదవోలు చరిత్ర సృష్టించింది.

​క్లబ్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయాల్లో భాగంగా ప్రతిష్టాత్మక ‘బెస్ట్ క్లబ్ ప్లాటినం అవార్డు’ దక్కగా, క్లబ్ ప్రెసిడెంట్ Rtn. మీసాల శివరామ హరిప్రసాద్ ‘బెస్ట్ ప్రెసిడెంట్ ప్లాటినం’ అవార్డును, సెక్రటరీ Rtn. దారపురెడ్డి శ్రీరామ ప్రతాప్ ‘బెస్ట్ సెక్రెటరీ అవార్డును అందుకొని క్లబ్ కీర్తిని మరింత ఇనుమడింపజేశారు. డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ అసెంబ్లీని అత్యంత విజయవంతంగా నిర్వహించినందుకు ప్రత్యేక గుర్తింపు అవార్డుతో పాటు, మానవతా దృక్పథంతో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలకు గాను మరో 13 డైమండ్, ప్లాటినం, గోల్డ్, సిల్వర్ అవార్డులు క్లబ్ ఖాతాలో చేరాయి.

​వైజాగ్ వేదికగా జరిగిన ఈ ఘన నివేదన మహోత్సవంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ గుంటిపల్లి శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ శివరామ హరిప్రసాద్, సెక్రటరీ శ్రీరామ ప్రతాప్ మరియు నిడదవోలు సీనియర్ రొటీరియన్స్ అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ అరుదైన పురస్కారాల పంట పండటానికి, ప్రతి సేవా యజ్ఞాన్ని దిగ్విజయం చేయడానికి అహర్నిశలు సహకరించిన రొటీరియన్స్ అందరికీ క్లబ్ ప్రెసిడెంట్ & టీం తమ హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు..

END

తూర్పుగోదావరి జిల్లా *రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు కు అవార్డుల పంట*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *