Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సత్యసాయి

తుమ్మల కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రెండో శనివారం ప్రత్యేక పూజలు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తుమ్మల కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రెండో శనివారం ప్రత్యేక పూజలు.

వార్త ముఖ్యాంశాలు

  • అమడగూరు మండలం,తుమ్మల గ్రామం కొత్తపేట సమీపంలోని తుమ్మల కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక్కపొద్దుల సందర్భంగా రెండవ శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సుమారు 500 మంది భక్తులు పాల్గొని స్వామివారి దర్శనంతో కృతార్థులయ్యారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్…

అమడగూరు మండలం,తుమ్మల గ్రామం కొత్తపేట సమీపంలోని తుమ్మల కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక్కపొద్దుల సందర్భంగా రెండవ శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సుమారు 500 మంది భక్తులు పాల్గొని స్వామివారి దర్శనంతో కృతార్థులయ్యారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చింతా శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…ఈ ప్రాంతంలోని అనేకమంది భక్తులు తిరుమలకు వెళ్లలేని పరిస్థితుల్లో తుమ్మల కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి తమ కోరికలు తీర్చించుకుంటున్నారు.ముఖ్యంగా కల్యాణయోగం మరియు సంతానయోగం కోసం స్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఉంది.కుటుంబ సమేతంగా భక్తులు వచ్చి తలనీలాలు సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత అని తెలిపారు.ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణను కొట్టు కృష్ణమూర్తి,కుట్టు వెంకటరమణ,కొట్టు వేమననారాయణ,కొట్టు అమర్నాథ్,కొట్టు రామాంజులు కుటుంబ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేశారు.స్వామివారి కృప ఫలితంగా ఇది సాధ్యమైందని కృతజ్ఞతా భావంతో అన్నప్రసాదం నిర్వహించినట్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ డైరెక్టర్ భూక్యా కాలే నాయక్,జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొట్టు అశ్వర్థ కుమార్,నూర్ మొహమ్మద్ తుమ్మలకొండను సందర్శించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గోపిశెట్టి శ్రీనివాసులు,బిల్లూరు మహేశ్వర్ రెడ్డి,రామనేని రామచంద్ర,సరళమ్మ,శ్రీనివాస్ రెడ్డి,ఆదిమూర్తి,రామ్మోహన్,ఈశ్వరయ్య,పూజారి రమణ,తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *