వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
విశాఖపట్నం, అక్టోబర్ 19 (పున్నమి ప్రతినిధి): జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా గాజువాక పోలీసులు తుంగలం, నాతయ్యపాలెం ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గాజువాక పోలీస్ స్టేషన్ సీఐ వాసు నాయుడు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పాల్గొని, స్థానిక ప్రజలకు ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ వాసు నాయుడు మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం, ఇతర బహుమతుల ప్రలోభాలకు లోనుకావద్దని, ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలకు దూరంగా ఉండాలని తెలిపారు.
ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని, ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల నిర్వహణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
Uploaded Video:




